కరీంనగర్‌ జిల్లాలో కలకలం రేపుతున్న కండ్లకలక కేసులు

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కలవర పెడుతోంది. వర్షాలు, వరదలతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న జనం కండ్లకలక వ్యాధి వ్యాపిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 2500లకు పైగా కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్ లో 400 మంది విద్యార్థులకు కండ్లకలక సోకింది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా కండ్లకలక సోకడంతో కేసులు పెరుగుతున్నాయి.

Conjunctivitis: తెలంగాణలో విస్తరిస్తున్న కండ్లకలక..600కుపైగా కేసులు

కరీంనగర్లోని ఓ గురుకుల పాఠశాలలో ఏకంగా 60 మంది విద్యార్థులకు కండ్లకలక అయింది. వారం రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్న విద్యార్థుల పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపూర్​ మండలం రామకృష్ణా కాలనీలోని మహాత్మ జ్యోతిబాఫులే బీసీ గురుకులంలో కొద్ది రోజుల క్రితం పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటికే తోటి విద్యార్థులతో కలిసిపోయారు. దీంతో ఒక్కొక్కరుగా అస్వస్థకు గురి కావడంతో అప్రమత్తమైన టీచర్లు డాక్టర్లకు సమాచారం అందించారు. డాక్టర్లు పరీక్ష చేసి కండ్లకలకగా గుర్తించారు. అప్పటికే దాదాపు 60 మంది విద్యార్థులకు ఈ అంటువ్యాధి సోకింది. విద్యార్థులు కళ్ల నుంచి నీరు రావడం.. జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అంటువ్యాధి కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొందరు పేరెంట్స్​ తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news