నాకున్న గ్లామర్‌కు హీరో అవుతా.. 10 హిట్లు కొడతా : వైసీపీ ఎంపీ

-

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యాలపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ‘నన్ను ఏకచిత్ర నటుడంటూ RRR మాట్లాడారు. నేను తలచుకుంటే సినిమాలు చేయగలను. నాకున్న గ్లామర్ కి 10 సినిమాలు తీసినా ప్రజలు అంగీకరిస్తారు.

10 సినిమాలు హీరోగానే చేసి హిట్లు కొడతాను. ఆ టాలెంట్ నాకుంది. అందులో RRR కు పాత్ర ఇస్తాను. నువ్వు కామెడీ పాత్రలకు కూడా పనికిరావు’ అంటూ రఘురామను భరత్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక విప్లవం మొదలైంది అన్నారు ఎంపీ మార్గాని భరత్. రాష్ట్రంలో పెట్టుబడులను చూసి ప్రతిపక్షాలు కడుపు మంటతో విమర్శలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్లను తప్పు పట్టడం బాధాకరం అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news