ప్రభాస్ సినిమాలో విలన్ కోసం భారీ స్కెచ్ వేసిన మారుతి..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరో గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలు షూటింగ్ సెట్లో ఉండగా.. ఇప్పటికే మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్ .. అయితే అందులో ఒకటి మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా.. ఈ సినిమాకు సంబంధించి మొదటివారం షూటింగ్ కూడా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్ని సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమా మాత్రం అన్నిటికంటే భిన్నంగా హారర్ కామెడీ మూవీ అన్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ని కూడా మారుతి ఫిక్స్ చేశాడని.. ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే వర్కింగ్ టైటిల్ తో కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో కే. విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు . అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా హీరోయిన్గా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కామెడీ హర్రర్ యాక్షన్స్ తో కూడిన కమర్షియల్ సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనే వార్త హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక అనుకున్నట్టుగానే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఇందులో విలన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి పోటీగా విలన్ పాత్ర కోసం మారుతి సంజయ్ ను సంప్రదించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక అప్డేట్ కూడా ఇస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news