అలా బాలయ్యకు మాత్రమే సాధ్యం అంటూ.. ఎమోషనల్ అవుతున్న ప్రముఖ నటుడు..!

-

నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .బయటకు గంభీరంగా.. రాజసం ఉట్టిపడేలాగా కనిపించినా.. లోపల మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వాడు అని ఆయనతో కలిసి నటించిన ఎంతోమంది చెబుతూ ఉంటారు. అంతేకాదు బాలయ్యతో ఒక్కసారి నటిస్తే చాలు అని ఆలోచించేవారు ఇప్పటికీ ఉన్నారనడం లో సందేహం లేదు. నిజానికి బాలకృష్ణను దూరం నుండి చూసినవాళ్లు ఆయన ఒక కోపిష్టి అని అందరూ అంటారు.. కానీ ఆయనను దగ్గర్నుంచి చూసినవారు మాత్రం బాలకృష్ణ మనస్తత్వం గురించి వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా మీడియా ముందు చెబుతూ ఉంటారు.

తాజాగా బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ఆయన మంచిదనం గురించి ఒక నటుడు తెలియజేస్తూ ఎమోషనల్ అవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని తో వీరసింహారెడ్డి సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలకృష్ణతో దునియా విజయ్ పోటీ పడుతున్న సంగతి మనకు తెలిసింది ఇప్పటికే విజయ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో పలు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “బాలకృష్ణ గారు చాలా గొప్పవారు.. నాకు దేవుడిచ్చిన అన్నయ్య.. కేవలం బాలకృష్ణ కోసం మాత్రమే నేను వీరసింహారెడ్డి సినిమాలో నటించాను. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గారితో పంచుకున్న నా అనుభవాల గురించి నేను మాటలలో చెప్పలేను. నేను ఇప్పటివరకు ఎంతోమంది హీరోలతో పని చేశాను కానీ బాలకృష్ణ లాంటి వ్యక్తిత్వం ఏ ఒక్క హీరోలో కూడా చూడలేదు” అంటూ ఎమోషనల్ అయ్యారు. సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అంటూ తన అభిప్రాయాలుగా వెల్లడించారు దునియా విజయ్.

Read more RELATED
Recommended to you

Latest news