మారుతి సుజుకి వెంటిలేటర్లు 20 రోజుల్లో 1500 వెంటిలేటర్లు…!

-

ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దానిపై పోరాట౦ చేయడానికి గానూ వైద్య పరికరాల అవసరం చాలా ఉంది. ప్రధానంగా చెప్పుకోవాలి అంటే కరోనా వైరస్ మహమ్మారితో పోరాడటానికి అవసరమైన పరికరాలలో కీలకం వెంటిలేటర్లు. ఈ నెల ప్రారంభంలో వీటిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వెంటిలేటర్ల లభ్యత లేదని కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఆటోమొబైల్ తయారీదారులకు ప్రత్యేక వెంటిలేటర్లను తయారు చెయ్యాలని విజ్ఞప్తి చేసింది. మారుతి సుజుకి, మహీంద్రా & మహీంద్రా వంటి కొన్ని అతిపెద్ద భారతీయ కార్ల కంపెనీలు ఈ పిలుపుకు సానుకూలంగా స్పందించడమే కాకుండా వాటి తయారిని వేగవంతం చేసాయి. మారుతి సుజుకి ఇప్పుడు ఈ విషయంలో కీలక అడుగు వేసింది. ఇప్పటికే సుమారు 20 రోజుల్లో 1,500 యూనిట్లకు పైగా వెంటిలేటర్‌ను తయారు చేశారు.

అయితే వాటిని ఇంకా వాడకం లోకి తీసుకుని రాలేదు. తయారు చేసినా సరే ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందనా లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించిన అనుమతి వస్తే తాము అందిస్తామని చెప్తుంది మారుతి సుజుకి. రాబోయే రోజుల్లో తాము మరిన్ని తయారు చేస్తామని, దీనిపై ప్రభుత్వం వేగంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తుంది. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news