Marwadi Controversy: తెలంగాణలో మార్వాడీ వ్యాపారస్తులపై తిరుగుబాటు చేస్తున్నారు లోకల్ వ్యాపారులు. ఇందులో భాగంగానే మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా బంద్ ప్రకటించారు ఆమనగల్లు లోకల్ వ్యాపారులు. నార్త్ ఇండియా నుంచి తెలంగాణకు వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, తాము ఎలా బతకాలంటూ వాపోతున్నారు లోకల్ వ్యాపారస్తులు.

మార్వాడీ వ్యాపారస్తులు గోబ్యాక్ అంటూ నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 18న స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు ఆమనగల్లు లోకల్ వ్యాపారస్తులు. అటు మార్వాడీలకు మద్దతు తెలిపారు బండి సంజయ్. గుజరాతీ మార్వాడీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టే వారిని వ్యతిరేకిస్తున్నారని… గుజరాతీలు తెలంగాణ సంపద దోచుకోవడానికి రావట్లేదని పేర్కొన్నారు. తెలంగాణలో మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేంటి ? మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే, మేం రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం అని హెచ్చరించారు బండి సంజయ్.