మే 22 ఆదివారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మంచిరోజు..

-

మేషం: చేపట్టిన పనులు అనుకున్న ఫలితాలను అందించవు.కానీబూ రకంగా సంతృప్తిని కలిగిస్తాయి.  ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఉన్నతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు..ఈరోజు కొత్త రుణాల కోసం సంప్రదింపులు జరుపుతారు.

వృషభం: నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి..అవి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా వేధిస్తున్న చికాకులు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.ఈరోజు అనుకొని ఆనందం కలుగుతుంది.

మిథునం: చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. రుణభారం వలన మానసికంగా స్థిమితం ఉండదు. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట నూతన సమస్యలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.  ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.వ్యాపారాలల్లో అంత మంచి ఆదాయం రాదు.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీ కష్టం వృధా అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభమున్నది..ఆదివారం ఓ ఇద్దరికీ ధాన్యాలు దానం చేయడం మంచిది.

సింహం: సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు..ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు.కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.

కన్య: సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరచి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు..ఇంట్లో మంచి గుర్తింపు వస్తుంది.కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

తుల: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు..ముఖ్యమైన పనులలో జాప్యం తప్పదు..ఈరోజు ముఖ్యమైన పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.

వృశ్చికం: కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. బంధువుల నుండి ఊహించని ఋణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విషయాలలో భాగస్థులతో విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి..ఏం పని చేసిన పెద్దగా ఫలితం ఉండదు..కొన్ని పనులు, ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ధనస్సు: అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలను పరిష్కరించుకుంటారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.దైవదర్శనాలు చేస్తారు.

మకరం: జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితం ఉండదు.  చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది..ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి..

కుంభం: నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులుతో శుభకార్యాలకు హాజరవుతారు.గృహ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి..శుభకార్యాలు, విందు వినోదాలలో పాల్గొంటారు..

మీనం: ముఖ్యమైన పనులు ఎంత అనుకున్న పూర్తీ కావు..సమయం వృధా అవుతుంది. బంధువులు, సన్నిహితుల నుండి వినకూడని మాటలు వినవలసి రావచ్చు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.ఇంటా, బయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.సంతాన, విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.ఈరోజు అంత మంచి రోజు కాదు..

Read more RELATED
Recommended to you

Latest news