మే 27 రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఈరోజు చాలా మంచిరోజు..

-

మే 27న రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము.. 

- Advertisement -

మేషం

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోమే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. అదృష్టం అనుకోకుండా జారిపొతుంది. ఆర్థిక నష్టం ఎక్కువగా వుంటుంది.దూర ప్రయాణాలు చేస్తారు..శుభకార్యాలలో పాల్గొంటారు..

వృషభం

చేపట్టిన కార్యాలయల్లొ విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.ఉద్యొగాలలొ మంచి గుర్తింపు వుంటుంది..ఈరోజు అనుకున్న పనులు నేరవేరుతాయి..

మిథునం

పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.

కర్కాటకం

ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.పూర్తీ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు చేపడతారు.. దైవదర్షనాలు చేస్తారు.

సింహం

ముఖ్యమైన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. కొత్త పనులు మొదలు పెట్టడం మంచిది కాదు.. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.ఈరోజు కొంత నిరాశ ఎదురవుతుంది.జాగ్రత్తగా ఉండటం మేలు..

కన్య

అకస్మాత్తుగా కుటుంబలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వింటారు. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.ఉద్యోగులు అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది.ఈరోజు అంత మంచి రోజు కాదు..

తుల

ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది..ఏదైనా చేసే ముందు ఆలొచించి చెయ్యడం మంచిది..

వృశ్చికం

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగును. ఆరోగ్యం మెరుగవుతుంది.

ధనుస్సు

చేపట్టిన పనులు ఈరోజు పూర్తీ అవుతాయి.. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు..మంచి పనులకు శ్రీకారం చుడతారు.కొత్త రుణాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడుతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఈరోజు ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి శుభకార్యాలకు వెళతారు.

కుంభం

ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. సమాజంలో మంచి పేరు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.విందువినోదాల లో పాల్గొంటారు..

మీనం

అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచలనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది..ఈరోజు అనుకున్న ఫలితాలు అందవు..జాగ్రత్తగా ఉండటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...