‘సోమవతి అమావాస్య ‘ రోజున ఇలా చేస్తే డబ్బే డబ్బు..

-

మే 30 న ‘సోమవతి అమావాస్య ‘..ఈ అమావస్య ప్రతి ముప్పై ఏళ్లకు ఒకసారి వస్తుంది..అందుకే చాలా పవర్ ఫుల్ అమావాస్య అని జ్యోతిష్య పండితులు అంటున్నారు. అయితే ఈరోజు కొన్ని నియమాలను పాటిస్తారు. అంతే కాదు కొన్ని ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.. భక్తి శ్రద్దలతో చేసే కొన్ని పూజల వల్ల మంచి సిరి సంపదలు కలుగుతాయని అంటున్నారు. అసలు ఆ పూజలు ఎలా చేయాలి అనేది వివరంగా తెలుసుకుందాం..

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయాలనుకుని అందర్నీ ఆహ్వానిస్తాడు.తనకు నచ్చని శివుడిని పెళ్లిచేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని(పార్వతిని), అల్లుడు శివుడిని పిలవడు. అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్లు ప్రత్యేకంగా పిలవాలా ఏంటనే ఆలోచనతో ప్రమథగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్లిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది. ఆగ్రహంతో ఊగిపోయిన శివుడు తన వెంట్రుకతో వీరభద్రుడిని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీద దాడి చేశారు..

గాయాల బాధ భరించలేకపోయిన చంద్రుడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుడి బాధచూసి కరిగిన భోళాశంకరుడు రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా కలిసొచ్చిందని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే ఆరోగ్యవంతుడవు అవుతావని చంద్రుడిని వరమిచ్చాడు . శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలుస్తున్నారు. సోముడు అంటే చంద్రుడు, ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుడిని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు..

అందుకే ఈరోజు శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తారు.బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే.. సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాల్లో కానీ, రాహు కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట..సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగి పోతాయని విశ్వాసం.సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాసం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగి ఆరోగ్యం, సంపద కలుగుతుంది..మహిళలకు మంచి రోజు.. సౌభాగ్యం లభిస్తుంది..ఎంత శ్రద్దగా చేస్తే అంతగా మంచి ఫలితాలు అందుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news