బిగ్ బ్రేకింగ్;లాక్ డౌన్ రెండు వారాలు పెంపు…?

-

లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. లాక్ డౌన్ ని మరో రెండు వారాలు పొడిగించాలని కేంద్రం భావిస్తుంది. దేశంలో కరోనా కేసులు 5 వేలు దాటాయి. దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కావాలి అంటే లాక్ డౌన్ అవసరం అని కేంద్రం భావిస్తుంది. రాష్ట్రాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యురప్ప, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే…

అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్, సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో ముందుకే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మరణాలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. ఒక్కసారి లాక్ డౌన్ ని ఎత్తివేస్తే పరిస్థితులు దారుణంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాక్ డౌన్ కొనసాగించడమే మంచిది అని భావిస్తున్నారు.

మే 15 వరకు విద్యాసంస్థలకు విద్యార్ధులు రావొద్దని… విద్యార్ధులకు పరిక్షలు కూడా నిర్వహించవద్దని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తుంది. ప్రస్తుతం 5500 కు కరోనా కేసులు చేరుకున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి రాష్ట్రాలు. కేంద్రం వద్దన్నా సరే రాష్ట్రాలు అమలు చెయ్యాలని భావిస్తున్నాయి. కరోనా మృతుల్లో ఎక్కువగా పురుషులు ఉన్నారు. ఇప్పటి వరకు మరణించిన వారిలో 90 మంది పురుషులే.

Read more RELATED
Recommended to you

Latest news