మెగా ‘లూసిఫెర్’ ముచ్చట అప్పుడేనా..?

-

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుందని గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. యువ దర్శకుడు సూజిత్ దర్శకత్వం వహిస్తారు అని గతంలో చిరు చెప్పకనే చెప్పారు. అయితే సుజిత్ స్థానంలో వి.వి.వినాయక్ వచ్చాడు అంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ విషయంలో వి.వి.వినాయక్ తనదైన శైలిలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే చిరంజీవి వివి వినాయక్ లూసిఫర్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవితో వినాయక్ ఠాగూర్ ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు . ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అటు అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు జరుగుతుండగా దసరా నాటికి ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయకుడు సోదరి పాత్ర ఎంతో కీలకం కాగా ఈ పాత్ర కోసం కుష్బూ సుహాసిని రామకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news