సీఎం జగన్ పై మేకపాటి సంచలన వ్యాఖ్యలు..ప్రజలను చీట్ చేయొద్దు !

-

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆయన వివరించారు. అందుకే గత ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరమన్నారు. ప్రజలను చీట్ చేయడం… మధ్య పెట్టడమో చేయకూడదని సూచనలు చేశారు.

ప్రజల సొమ్ము కు ధర్మకర్త లే కానీ.. సొంత దారులం కాదని గుర్తు పెట్టుకోవాలని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకి అప్పగించాలని కోరారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందని… ఇప్పట్లో ఏపీ గోల్డెన్ చాలా కష్టమని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ లాంటి మహా నగరాన్ని ఏపీలోనూ నిర్మించాలని ఆయన సూచనలు చేశారు. తాను మొదట్లో హైదరాబాద్‌ కు వెళ్లినప్పుడు అక్కడే.. ఒక్క ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ మాత్రమే ఉండేదని.. కానీ ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి లో దూసుకుపోతుందని చెప్పారు. అలాగే ఏపీని అభివృద్ధి చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news