ఆ కోరికలు మగవాళ్లకే ఎక్కువ..!

-

సెక్స్​ కోరికలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయి. ఆడవారిలోనూ.. మగవాళ్లలోనా. ఎవరిని అడిగినా దాదాపుగా చెప్పే సమాధానం ఒకటే మగవాళ్లలో అని. కొందరు పురుషులు మాత్రం లేదు ఆడవాళ్లలోనే ఎక్కువ కానీ వాళ్లు బిడియంతో బయటపడరు అని అంటున్నారు. మరి దీనిపై నిపుణులు ఏం అంటున్నారంటే..?

 

మగవారిలో ఎక్కువగా ఉంటాయా? ఆడవారిలో ఎక్కువగా ఉంటాయా? కొన్ని సర్వే సంస్థలు మగవారిలో అని చెబితే.. మరికొన్ని సర్వే సంస్థలు ఆడవారిలో అని నివేదికలు ఇస్తున్నాయి. అయితే సమాజంలో మాత్రం మహిళలతో పోల్చితే పురుషులు సెక్స్​పై ఎక్కువ ఆసక్తి చూపుతారని అంటుంటారు.

శృంగార కోరికలు ఆడవారిలో, మగవారిలో.. ఇద్దరిలోనూ సమానంగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువ అని ఉండదని చెబుతున్నారు. సమాజంలో సెక్స్​ విషయంలో ఆడవాళ్లకు అంతగా స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోందని పేర్కొంటున్నారు. మగువలకు సెక్స్​ కోరికలు కలిగినా.. సమాజంలోని పరిస్థితులకు తలొగ్గి.. వాటిని బయటపెట్టరని చెబుతున్నారు. కేవలం భౌతిక రూపాల్లోనే తేడాగా ఉంటాయని.. శృంగారం విషయంలో ఇద్దరూ సమానమే అని అంటున్నారు.

శృంగారంలో పాల్గొనడానికి వయసుతో సంబంధం లేదనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సరైన వయసులో సెక్స్​ చేసినప్పడే ఆ అనుభూతిని పొందుతారని అంటున్నారు. అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 నిండిన తర్వాత శృంగారంలో పాల్గొనడం మేలని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news