మీరాబాయి చాను అనూహ్య నిర్ణయం… సాయం చేస్తానంటూ పిలుపు

-

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి చాను కీలక నిర్ణయం తీసుకున్నారు. తన శిక్షణ సమయంలో సహకరించిన ట్రక్ డ్రైవర్లుకు సాయం చేసేందుకు ఆమె రెడీ అయ్యారు. ట్రక్ డ్రైవర్లు తనను కలవాలని, చేతనైన సాయం చేస్తానని ఆమె ప్రకటించారు. తాను శిక్షణ కేంద్రానికి వెళ్లే సమయంలో ఉచితం లిఫ్ట్ ఇచ్చిన వారిని కలవాలని పిలుపు నిచ్చారు. వారి ఆశీర్వాదాలు కావాలని ఆమె కోరారు. తను కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్లు సహకరిచారని తెలిపారు. వారి కోసం తాను వెతుకుతున్నట్లు మీరాబాయి చెప్పారు.

కాగా మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో మహిళల 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి ఈ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొదటి పతకాన్ని అందించారు. ప్రస్తుతం ఆమె నాంగ్‌పాక్ కచింగ్ గ్రామంలోని ఇంటి దగ్గర ఉంటున్నారు. ఒలింపిక్స్ ముందు ఇంఫాల్‌లోని ఖుమాన్ లాంపక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని శిక్షణా కేంద్రంలో ఆమె శిక్షణ పొందారు.

మీరాబాయి చాను తల్లి సాయిఖోమ్ ఒంగ్బీ తొంబి దేవి గ్రామంలో టీ స్టాల్ నిర్వహించేవారు. ఎథమ్ మొయిరాంగ్‌పురెల్ ప్రాంతం నుండి వెళ్లే ట్రక్కులు ఆ దుకాణం వద్ద ఆగేవి. అలా చానుకు లిఫ్ట్ ఇచ్చేవారు. ఉచితగా తీసుకెళ్లి శిక్షణ కేంద్రం వద్ద దింపేవారు. అలా ప్రయాణ ఖర్చు ఉండేవి కాదని, ఆ డబ్బులను ఇంటి ఖర్చులకు ఉపయోగించేదానినని ఆమె తల్లి తొంబి దేవి చెప్పారు.

చాను సోదరుడు, సాయిఖోమ్ సనతోంబా మీటీ, ఒలింపిక్స్.కామ్‌తో మాట్లాడుతూ, “మా తల్లిదండ్రులు మీరాబాయి చాను ప్రయాణానికి రూ.10-20 ఇచ్చేవాళ్లు. గ్రామం చాలా చిన్నది కావడం వల్ల మేము ప్రతిఒక్కరికీ తెలుసు. ఉదయాన్నే ట్రక్కులు మార్కెట్ కూడలి నుంచి బయలుదేరేవి. మీరాబాయిని ఆ ట్రక్కుల్లో శిక్షణ కేంద్రానికి పంపేవాళ్లం. అయితే వాళ్లు ఎప్పుడూ కూడా మీరాబాయితో అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రతిరోజూ వాళ్లతో ఒంటరిగానే వెళ్లేది.’’ అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news