Messi Fifa 2022 : మెస్సీదే వరల్డ్ కప్.. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు తప్పని ఓటమి

-

పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌పై 4-2 తేడాతో గెలుపొందిన అర్జెంటీనా, మూడోసారి ఫిఫా వరల్డ్ కప్‌ గెలిచింది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో రెండోసారి హ్యాట్రిక్ నమోదయింది. ఫ్రాన్స్ స్టార్ ఫుడ్ బాలర్ ఎంబాపె, అర్జెంటీనాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. 80వ, 81వ, 118 వ నిమిషాల్లో ఎంబాపే గోల్స్ కొట్టాడు. దాదాపు 56 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ కు చెందిన ఆటగాడు ఈ రికార్డు నమోదు చేశాడు.

ఇప్పుడు ఆ రికార్డు మళ్లీ రిపీట్ అయింది. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ ఓడటం గమనార్హం. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది.

కాగా, ఖతార్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో తన జట్టు అర్జెంటినాను ఛాంపియన్ గా నిలబెట్టిన తర్వాత ఆ దేశ స్టార్ ఫుట్ బాలర్ కెప్టెన్ లియోనల్ మెస్సి తన రిటైర్మెంట్ పై స్పందించాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో 2026 లో జరిగే వరల్డ్ కప్ లోను మెస్సి ఆడే అవకాశం ఉంది. ఈ వరల్డ్ కప్ తర్వాత మెస్సి రిటైర్ అవుతాడని వార్తలు వచ్చిన క్రమంలో మెస్సి ఇలా స్పందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news