వామ్మో..ఈ మలయాళీ నటుల ఆస్తులు విలువ అన్ని వేల కోట్లా..?

-

సాధారణంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తున్న నటీనటులలో చిరంజీవిని మొదలుకొని మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ వరకు ప్రతి ఒక్కరూ ప్రేక్షకులను అలరిస్తున్న వారే. అయితే వీరంతా కూడా సినిమాల ద్వారా భారీ స్థాయిలో సంపాదిస్తూనే ఆ డబ్బులను పెట్టుబడి రూపంలో పెట్టి.. భారీ స్థాయిలో ఆస్తులను వెనకేసుకుంటున్నారు. ముఖ్యంగా మిగతా హీరోలతో పోల్చుకుంటే మలయాళం నటులు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు హాస్పిటల్, రెస్టారెంట్లలో కూడా పెట్టబడులు పెడుతూ భారీగా సంపాదిస్తున్నారు. ఇకపోతే గత నాలుగు ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ హీరోలైన మమ్ముట్టి , మోహన్ లాల్ ఆస్తుల విలువలో ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మరి వారి నికర ఆస్తి విలువ ఎంతో ఇప్పుడు చూద్దాం.

1. మోహన్ లాల్:
మెగాస్టార్ మోహన్ లాల్ ఆస్తి విలువ రూ. 376 కోట్ల రూపాయలు. ఈయన నటనలో సంపాదించిన డబ్బును ఫుడ్, హాస్పిటల్, ఫైనాన్స్ రంగాలలో కూడా భారీగా పెట్టబడులు పెట్టారు. కొచ్చిలో ఇటీవల హోటల్ ప్రారంభించి.. వచ్చిన ఆ డబ్బులతో ఇంకొంత ఎక్కువ డబ్బు హాస్పిటల్ వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టారు . అంతేకాదు సొంత చలనచిత్ర, నిర్మాణ పంపిణీ సంస్థ మాక్స్ ల్యాబ్ ఎంటర్టైన్మెంట్స్ ను కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు రూ. 30 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

2. మమ్ముట్టి:
గత 50 సంవత్సరాలుగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మలయాళం నటుడి ఆస్తి విలువ రూ. 360 కోట్లు. ఈయన మలయాళం కమ్యూనికేషన్స్ చైర్మన్గా ఉండడంతో పాటు తన ప్రొడక్షన్ బ్యానర్ మమ్ముట్టి కంపెనీ కింద సినిమాలు కూడా నిర్మించి భారీగా సంపాదిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే మమ్ముట్టి ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news