ఎంఐ, రెడ్‌మీ, పోకో ఫోన్ల‌లో స‌మ‌స్య‌లు.. ప‌రిష్క‌రిస్తామన్న షియోమీ..!

-

షియోమీకి చెందిన ఎంఐ, రెడ్‌మీ ఫోన్ల‌తోపాటు పోకో ఫోన్ల‌ను ఉప‌యోగిస్తున్న‌వారికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఆయా ఫోన్ల‌లో బూట్ లూప్ అనే స‌మ‌స్య వ‌చ్చింది. దీంతో ఫోన్లు ప‌దే ప‌దే రీస్టార్ట్ అవుతున్నాయ‌ని యూజ‌ర్లు వాపోతున్నారు. ఆయా ఫోన్ల‌ను వాడుతున్న యూజ‌ర్లు పెద్ద ఎత్తున ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నార‌ని తెలుస్తోంది. దీంతో షియోమీ ఈ విష‌య‌మై స్పందించింది.

mi and redmi and poco phones users are facing boot loop issues

స‌ద‌రు ఫోన్ల‌లో ఎంఐయూఐ 12.05 గ్లోబ‌ల్ స్టేబుల్ రామ్‌ను అప్‌డేట్ చేశాకే స‌మ‌స్య వ‌స్తున్న‌ట్లు షియోమీ గుర్తించింది. అలాగే కొన్ని ఫోన్ల‌లో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వస్తుంద‌ని షియోమీ నిర్దారించింది. ఈ క్ర‌మంలోనే ఎంఐ 10టి ప్రొ, ఎంఐ 10, రెడ్‌మీ కె20 ప్రొ, రెడ్‌మీ నోట్ 9, నోట్ 7 ప్రొ, పోకో ఎక్స్ 3 ఫోన్ల‌లో బూట్ లూప్ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ మేర‌కు పోస్టులు పెడుతున్నారు.

అయితే ఈ స‌మ‌స్య కార‌ణంగా అనేక మంది ఫోన్ల‌లో ఉండే త‌మ డేటాను కూడా కోల్పోయార‌ని స‌మాచారం. కాగా షియోమీ ఇందుకు స్పందిస్తూ కొత్త అప్‌డేట్‌ను విడుద‌ల చేస్తామని తెలిపింది. వీలైనంత త్వ‌ర‌గా ఫోన్ల‌కు అప్‌డేట్‌ను ఇస్తామ‌ని, యూజర్లు త‌మ ఫోన్ల‌ను స‌ర్వీస్ సెంట‌ర్ల‌కు తీసుకెళ్లి కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయించుకోవ‌చ్చ‌ని, దీంతో బూట్ లూప్ స‌మ‌స్య ఉండ‌ద‌ని తెలియ‌జేసింది. బూట్ లూట్ వ‌ల్ల ఫోన్ ఆన్ అయిన వెంట‌నే ఆఫ్ అవుతోంది. మ‌ళ్లీ ఆన్ అవుతోంది. దీంతో అందులో అస‌లు ఏం సెట్టింగ్ చేద్దామన్నా వీలు కావ‌డం లేద‌ని యూజ‌ర్లు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news