పూణే లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధ వారం రాత్రి ముంబై ఇండియన్స్, కోల్ కత్త నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కాగ ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచ్ లకు మూడు కూడా ఓడిపోయింది. కాగ నిన్నటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 161 మాత్రమే చేసింది.
ఓపెనర్లు రోహిత్ (3), ఇషాన్ కిషాన్ (14) మరోసారి విఫలం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (52) తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (38) మరో సారి రాణించారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత్త నైట్ రైడర్స్ జట్టు.. ఓపెనర్ వెంకటేశ్ అయ్యార్ (50) తో పాటు పాట్ కమ్మిన్స్ (56 నాటౌట్) చేశాడు. కేవలం 14 బంతుల్లోనే పాట్ కమ్మిన్స్ అర్థ శతకం బాదాడు.
దీంతో కెఎల్ రాహుల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్ లో కమ్మిన్స్ 373.33 స్ట్రైక్ రేటు తో 4 ఫోర్లు, 6 సిక్స్ లు బాదాడు. దీంతో కోల్ కత్త జట్టు.. మరో నాలుగు ఓవర్లు ఉండగానే గెలుపు తీరాలను అందుకుంది. కాగ ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కమ్మిన్స్ కు దక్కింది.