మైఖేల్ క్లార్క్ చెంప చెళ్లుమనిపించిన ప్రియురాలు..వీడియో వైరల్

-

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన మైకేల్ క్లార్క్ కు చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ, గర్ల్ ఫ్రెండ్ జెడ్ యాబ్రో బహిరంగంగా క్లార్క్ చెంపలు వాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో క్లార్క్, జెడ్ కు సర్ది చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆమె ఏమాత్రం కన్విన్స్ కాకపోగా, మరింత రెచ్చిపోయింది. బూతులు తిడుతూ, పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావు, నువ్వు మదమెక్కిన కుక్కవు అంటూ పబ్లిక్ గా క్లార్క్ పై దాడికి దిగింది. తానే తప్పు చేయలేదని క్లాత్ సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేయగా, సదరు మహిళతో చేసిన ఫోన్ చాట్ ను బయట పెట్టాలని జేడ్ గట్టిగా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకుందట.

Read more RELATED
Recommended to you

Latest news