మైక్రోమాక్స్ మళ్లీ వచ్చేస్తుంది..

-

భారత దేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీదారు మైక్రో మాక్స్ మళ్లీ వచ్చేస్తోంది. చైనా కంపెనీలైన రెడ్ మీ, వివో, ఒపో నుండి వచ్చిన పోటీ కారణంగా మైక్రో మాక్స్, తన తయరీని ఆపేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో నంబర్ వన్ అమ్మకందారుగా పేరు తెచ్చుకున్న మైక్రో మాక్స్, చైనా కంపెనీలు పోటెత్తడంతో చిరునామా లేకుండా పోయింది. ఐతే తాజా సమాచారం ప్రకారం మైక్రో మాక్స్ మళ్లీ తన సేవలు పునరుద్ధరిస్తుందట.

ఈ మేరకు మైక్రో మాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మ ఒకానొక వీడియోతో బయటకి వచ్చాడు. ట్విట్టర్ ద్వారా వీడియోని పంచుకున్న రాహుల్ శర్మ, మైక్రో మాక్స్ సంస్థ ఎలా ఎదిగింది మొదలగు విషయాలని చెబుతూనే, దేశ పౌరుల నుండి వస్తున్న రిక్వెస్టులని గుర్తు చేసాడు. ప్రధాని కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో దేశ తయారీ రంగం గురించి చెప్పినట్టుగా చెప్పారు. అందుకే ఇండియా కోసం మళ్ళీ వస్తున్నట్టుగా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news