ఆ ఆట‌గాడి ఫొటోకు కోట్ల లైకులు.. ఇంత‌కీ ఎవ‌రాయ‌న అంటే?

-

ప్రస్తుత సోష‌ల్ మీడియా ప్ర‌పంచంలో ఎప్పుడు ఏది వైర‌ల్ అవుతుందో చెప్పడం ఎవ‌రి త‌రం కాదు. మ‌న‌కు ఎక్క‌డ ఆ క‌నిపించని క‌నీవినీ ఎరుగ‌ని అద్భుత‌మైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంటాయి. ఇక సెలబ్రిటీల విస‌యానికి వ‌స్తే వారు ఏది పెట్టినా అది క్షణాల్లోనే ట్రెండయి సంచ‌ల‌నంగా మారుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. కానీ క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో కోట్ల లైకులు కురిపిస్తోంది ఓ ఆట‌గాడి ఫొటో.

 

ప్ర‌పంచంలోనే ఎంతో ఫేమ‌స్ అయిన ఫుట్ బాల్ దిగ్గజ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న ఇన్ స్టా గ్రామ్ వేదికగా రీసెంట్ గా షేర్ చేసిన ఓ ఫొటో విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సరికొత్త రికార్డుతో ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

అయితే అంత‌లా ఆక‌ట్టుకుంటున్న ఆ ఫొటోలో లియోనెల్ మెస్సీ తాను రీసెంట్‌గా కోపా అమెరికా ఫైనల్స్‌లో బ్రెజిల్ టీమ్ మీద విజయం సాధించడంతో ఆ ట్రోఫీతో దిగింది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా మెస్సీకి కోట్లాది మంది అభిమానులు ఉండ‌టంతో అది చూసి వారు తెగ లైకులు కొట్టేస్తున్నారు. మెస్సీ దిగిన ఆ ఫొటోకు ఇప్ప‌టికే రెండు కోట్లకు పైగా లైకులు రాగా కామెంట్స్ కూడా వేల్ల‌ల్లోనే కురుస్తున్నాయి. ఇక ఇంతుకు ముందు డీగో మారడోనా చ‌నిపోయిన‌ప్పుడు స్టార్ ప్లేయ‌ర్ రొనాల్డో ఆయ‌న ఫొటో షేర్ చేయగా ఇప్ప‌టి వ‌ర‌కు 1.98 కోట్ల లైకులు రావ‌డంతో ఇప్పుడు మెస్సీ ఫొటో దాన్ని బీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news