జగన్ ను ఓడించడం ఎవరి వల్ల కాదు : మంత్రి అంబటి

-

ఏపీలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు గుంటూరులో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ చేయలేని సంక్షేమ పనులు కూడా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని కొనియాడారు. జగన్ ను ఓడించడం ఎవరి వల్ల కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుష్ట చతుష్టయం కలసి వచ్చినా జగన్ ను ఓడించలేరని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. రాబోయే ప్లీనరీలో ఎన్నికల యుద్దభేరి మోగించబోతున్నామని ఆయన వెల్లడించారు. చంద్రబాబునీ కుప్పంలో ఓడించి తీరుతామని, చంద్రబాబు, సొంత పుత్రుడితో వచ్చినా, దత్త పుత్రుడుతో వచ్చిన కృష్ణా నది లో కలపడానికి వైసీపీ క్యాడర్ సిద్ధంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

YSRCP MLA Ambati Rambabu Reinfected With Coronavirus | Tupaki English

చంద్రబాబు, పవన్ లు కలిసినా మళ్ళీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి సిద్దం గా లేడని, చంద్రబాబునీ సీఎం చేయడానికి పవన్ కార్యకర్తలను వాడుకుంటున్నాడంటూ ఆరోపించారు మంత్రి అంబటి. ప్లీనరీలో తీసుకోబోయే నిర్ణయాలు చరిత్రాత్మకంగా నిలవబోతున్నాయని ఆయన వెల్లడించారు. లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయని, టీడీపీ మహానాడు నిర్వహించినప్పడు నుండి టీడీపీ నాయకులకు నోటికి హద్దు లేకుండా పోయిందని, అయ్యన్న నోరు మరుగుదొడ్డి లా తయారయ్యిందన్నారు అంబటి రాంబాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news