నడక ఆరోగ్యానికి మంచిది.. లోకేష్ లాంటి వారికి మరింత మంచిది – మంత్రి అప్పలరాజు

-

ఈనెల 27 నుంచి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ చేపట్టబోయే యువగలం పాదయాత్ర పై విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి సిదిరి అప్పలరాజు. నడక ఆరోగ్యానికి మంచిందని.. లోకేష్ లాంటి వారికి మరింత మంచిదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఆరోగ్యం మెరుగు పరచుకోవడానికి చేస్తున్న యాత్రకు యువగళం అని పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

బాబు వస్తే ఇంటికో ఉద్యోగం, బ్యాంకులో కుదవ పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు మీ తండ్రి ఇచ్చారో చెప్పాలని లోకేష్ ని ప్రశ్నించారు మంత్రి. ముఖ్యమంత్రి యువనేస్తం అని మీ తండ్రి ఎన్నికల ముందు ప్రకటించారని.. రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చారు… కనీసం లక్ష మందికి ఇచ్చినట్లు చూపండని సవాల్ విసిరారు. యువ నేస్తం కాదు యువ మోసం అంటే బాగుంటుందని విమర్శించారు. బాబు వస్తే జాబు అంటూ ఆనాడు నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. గడప గడప కు ప్రోగ్రాం పోటీగా ప్రతిపక్ష పార్టీ పగటి వేషాలు వేస్తోందని మండిపడ్డారు.

మొన్నటి వరకూ బాదుడే బాదుడే అన్నారని, ప్రజలు పట్టించుకోకపోవడంతో ఇదేం ఖర్మ అంటూ ప్రజలే వారిని రిజక్టు చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ ఫలాలు ఇస్తున్నారో తాను కూడా ఇస్తానని చంద్రబాబునాయుడు అనడం ఏమి ఖర్మ బాబూ అనిపిస్తుందన్నారు. మేము ఇస్తున్న పథకాల వల్ల రాష్ట్రం అప్పులు పాలు అన్న బాబు ఇదే పథకాలు కంటిన్యూ చేస్తాననడం బాబు మాటల గారిడీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు అధికారంలోకి రాలేడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news