సభలో జనం లేక, ఖాళీ కుర్చీలను చూసి చంద్ర బాబు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు ‘రా కదలిరా’ బహిరంగ సభ అట్టర్లాప్ అని, ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని దాడిశెట్టి రాజా అన్నారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. మా సామాజిక వర్గాన్ని అవమానపరిచారని ఆయన మండి పడ్డారు . సంక్రాంతి తర్వాత టీడీపీలో ఎవరూ ఉండరు అని.. అంతా ఖాళీ అయిపోయి టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరన్నారు. చంద్రబాబు, లోకేశ్ లక్షలు కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
1975లోనే మా భూములు 10 ఎకరాలు పంచిపెట్టామని,అప్పుడు నువ్వు తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టే వాడివంటూ ఆయన వ్యాఖ్యానించారు. 10 నియోజకవర్గాల నుంచి ప్రజలను తీసుకువచ్చావంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన గురించి తుని ప్రజలకు తెలుసని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు తుని నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.