మంత్రి ఎర్రబెల్లా.. మజాకా.. చెట్టు ఎక్కి కల్లు గీసిన ఎర్రబెల్లి

-

తెలంగాణలో యాక్టివ్‌గా ఉన్న మంత్రుల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. అయితే.. ఇవాళ జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. పాలకుర్తి మండలం మల్లంపల్లిలో స్వయంగా గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. నిచ్చెన వేసుకుని తాటి చెట్టు ఎక్కిన ఎర్రబెల్లి… అక్కడ కల్లుతో నిండి ఉన్న ముంతను కిందికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అందులోని కల్లును గ్లాసులో పోసుకుని హాయిగా ఆస్వాదించారు. విశేషం ఏంటంటే… మంత్రి ఎర్రబెల్లి ఎక్కిన తాటిచెట్టు మూడేళ్ల కిందట ఆయన పంపిణీ చేసిందే.

సుగర్,బిపి ఉన్నోల్లే కల్లు త్రాగాలరా భై😂😂: Minister Errabelli Dayakar Rao  Drinks Toddy Water - YouTube

 

కల్లు గీత కార్మికులకు ప్రోత్సాహం అందించే క్రమంలో నాడు ఎర్రబెల్లి గిరక తాటి మొక్కలు పంపిణీ చేశారు. ఇప్పుడవి పెరిగి పెద్దవై, కల్లు అందిస్తున్నాయి. సాధారణ తాటిచెట్లు ఎంతో ఎత్తుకు పెరుగుతాయి. గిరక తాటిచెట్లు తక్కువ ఎత్తుతో, స్వల్పకాలంలోనే కల్లు గీతకు అందుబాటులోకి వస్తాయి. గిరక తాటిచెట్లు అయితే ఎక్కడం సులువుగా ఉంటుందని, ప్రమాదాలకు అవకాశం ఉండదని తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఈ తరహా తాటి చెట్లను పంపిణీ చేస్తోంది. ఇవి బీహార్ లో ఎక్కువగా కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news