హ్యాట్రిక్ విక్టరీ..జగన్ మాస్టర్ ప్లాన్..ఆ స్థానాల్లో నో డౌట్.!

హ్యాట్రిక్ విక్టరీ: మళ్ళీ విజయం సాధించి..ప్రజా మద్ధతుతో అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారంలో ఉంటూ ప్రజలకు మంచి పనులు చేస్తున్న జగన్..మరొకసారి అధికారంలోకి వచ్చే దిశగా ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో ఈ సారి విజయం ఎలాంటి ఢోకా ఉండకుండా ప్లాన్ చేస్తున్నారు. అయితే గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న స్థానాల్లో కాస్త ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..అలాంటి చోట్ల మళ్ళీ గెలవడానికి జగన్ మాస్టర్ ప్లాన్ తో ముందుకొస్తున్నారు.

ఇప్పటికే వేరే పార్టీల్లోని కీలక నేతలని చేర్చుకుంటూ ముందుకొస్తున్న జగన్..ఆయా స్థానాల్లో టి‌డి‌పిని దెబ్బతీసే విధంగా స్కెచ్ వేస్తున్నారు. బలమైన టి‌డి‌పి కేడర్ ని వైసీపీ వైపుకు తిప్పుకుంటున్నారు. రెండుసార్లు గెలిచిన స్థానాల్లో మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అలా హ్యాట్రిక్ అవకాశం ఉన్న స్థానాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. గత రెండు ఎన్నికల నుంచి కర్నూలులో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకుంటుంది. 2014లో 14 స్థానాలకు గాను 11 స్థానాలని గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 14కి 14 స్థానాలు కైవసం చేసుకుంది.

అంటే ఈ జిల్లాలో 11 స్థానాల్లో వరుసగా రెండుసార్లు గెలుస్తూ వచ్చింది..ఇప్పుడు వాటిల్లో మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేశారు. అలా హ్యాట్రిక్ అవకాశం ఉన్న సీట్లలో పాణ్యం ముందు వరుసగాలో ఉంది. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మళ్ళీ ఇక్కడ గెలవడం ఖాయం. అలాగే నందికొట్కూరు స్థానంలో కూడా వైసీపీకి తిరుగులేదు. మళ్ళీ ఇక్కడ పక్కాగా గెలవనుంది. అటు శ్రీశైలంలో హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉంది. డోన్ లో కూడా హ్యాట్రిక్ ఫిక్స్. నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాల్లో కూడా డౌట్ లేకుండా హ్యాట్రిక్ కొట్టేలా ఉంది. మొత్తానికి హ్యాట్రిక్ కొట్టే స్థానాలు ఎక్కువగానే ఉన్నాయి.