దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పాలన వల్ల దేశం వెనుకబాటుకు గురయిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆ ప్రభుత్వాల పాలనలో దేశంలో ఆకలి, దుర్భిక్షం మరింత ఎక్కువ అయ్యాయని ఆరోపించారు.
గత ప్రభుత్వ పాలనలో నీళ్లు చూడాలే.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సంవత్సరకాలం నీళ్లు పరుగులు తీస్తూ ఎడారిగా ఉన్నా భూములన్నీ పంట పొలాలతో కళకళలాడుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. శుక్రవారం మండలం లో ఐదు ఎంపీటీసీల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కార్యక్తరలనుద్దేశించి మాట్లాడారు. ‘మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. చివరి శ్వాస వరకు సేవ చేస్తా. ఈ తెలంగాణ గడ్డ గులాబీ అడ్డా. రానే రాదు అన్న తెలంగాణను, కానే కాదు అన్న కాళేశ్వరాన్ని కట్టి మండుటెండల్లో మత్తల్లుతో కేసీఆర్ దుంకిస్తున్నారన్నారు. నేడు కేసీఆర్ దయతో కాలంతో సంబంధం లేకుండా పంట వేయవచ్చన్నారు.