ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించిన కేఏ పాల్

ఏపీ రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్న ఆయన.. తాను, జగన్ కలిస్తే చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడని జోస్యం చెప్పారు. అసలు ప్రధాని మోడీకి, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? జగన్ ఏం చేశారని పవన్ వ్యతిరేకిస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే సమయంలో.. వివేకా హత్య కేసు వ్యవహారంపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు ద్రోహి అని, ఆయన్ను విచారించాలని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబుని ఎందుకు విచారించడం లేదు? సీబీఐ చంద్రబాబు తొత్తా? అని అనుమానం వ్యక్తం చేశారు.

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నా ఆస్తులు అమ్మైనా సరే... | Prajashanti  Party Chief KA Paul Visakhapatnam Andhrapradesh Suchi

ఇప్పటికైనా తనను ఎన్నుకోకపోతే మూర్ఖులు, దరిద్రులు… అడుక్కుతింటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మీరు మూర్ఖులు కాకండి, దరిద్రులు కాకండి, దేవుడు చూపిన మార్గాన్ని ఎన్నుకోండి… కులాలకు, మతాలకు అతీతంగా కేఏ పాల్ ను, మీ ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. లేదు… మాకు కమ్మోడు చంద్రబాబునాయుడే కావాలి అనుకుంటారేమో… కమ్మోళ్లు అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు… లోకేశ్ వచ్చి ఏంచేస్తాడు? ఆ పప్పుకు మాట్లాడడమే సరిగా రాదు. లోకేశ్ చేస్తున్నది పాదయాత్ర కాదు.. డ్రామా యాత్ర” అంటూ వ్యాఖ్యానించారు.