రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఢిల్లీ గద్దలు వాలుతున్నాయని.. వాటితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్, బొగ్గును తరలించకపోవాలని ఢిల్లీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. బిజెపి, కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వస్తారని.. వారంతా ఢిల్లీకి గులాములని విమర్శించారు. కెసిఆర్ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు.
కెసిఆర్ ధర్మం వైపు, ప్రజల వైపు ఉన్నారని.. రైతు రసం క్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు సంతోషంగా ఉన్నారని, భూమికి బరువు అయ్యేంత పంట పండుతుందని తెలిపారు గంగుల కమలాకర్. రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నో గోసలు పడ్డామని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కెసిఆర్ ముందుచూపుతో కాలేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పుడు నిండుగా నీళ్లుు ఉన్నాయన్నారు.