వేలాది మందికి సౌకర్యం కల్పించడానికి బస్ స్టాండ్ పునర్నిర్మాణం చేశామని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. ఆయన సిద్ధిపేటలో మాట్లాడుతూ.. కేంద్రం అన్ని ప్రభుత్వ ఆస్తులు అమ్మితే మేము కాపాడుకుంటున్నామని ఆయన తెలిపారు. వేలాది కార్మికులు ఆర్టీసీ లో పనిచేస్తున్నారని, ఎంతో మంది జీవితాలకు తోడుంటుందని ఆయన అన్నారు. ఆర్టీసీ మనందరిది, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. ఈ బస్ స్టాండ్ తెలంగాణ ఉద్యమానికి అడ్డాగా ఉన్నదని, ఢిల్లీకి ఉద్యమ గలాన్ని వినిపించిన అడ్డ ఈ బస్టాండ్ గడ్డ అని ఆయన వ్యాఖ్యానించారు. అవార్డుల అడ్డా సిద్ధిపేట గడ్డ అంటూ అని, ప్రజల భాగస్వామ్యంతో ఈ అవార్డులు సాధిస్తున్నామన్నారు.
కార్మికుల కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామని, విద్య వైద్య రోడ్లు ఇలా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఒక ఏడాదిలో రైలు వస్తుందన్న హరీష్‌రావు.. ఐట్ పార్కులో సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకొస్తామని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడాము మన అదృష్టమని, తాగునీరు, సాగునీరు మౌలిక సదుపాయాలు తెచ్చుకున్నామన్నారు. విడిపోయి మనం అభివృద్ధి చెందితే, వారు వెనుకపడి పోయారని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల కు పోయి చూస్తే మన తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో కనపడుతదని ఆయన వ్యాఖ్యానించారు.