TSPSC పేపర్ లీక్: ప్రతిపక్షాలపై ఫైర్ అయిన మంత్రి హరీష్ రావు !

-

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన TSPSC పేపర్ లీక్ ఉదంతం గురించి ఇప్పుడలా మరిచిపోయేలా లేరు. ఎందుకంటే రోజూ దీని పైన అధికార పార్టీ నాయకులు మరియు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కామెంట్ లు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అంటూ చింతించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ … పేపర్ లీక్ అయ్యాక ప్రభుత్వమే అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటూ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూస్తోంది.

ఇందులో ఎక్కడా కూడా ప్రతిపక్షాలు చేసింది ఏమీ లేదు. పేపర్ లీక్ అయిన తర్వాత ఆ విషయాన్ని గుర్తించింది మ ప్రభుత్వం.. దీనికి కారణమైన వారిని అరెస్ట్ చేయించి విచారణ ద్వారా కీలక విషయాలను బయటపెట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. అంతే కాకుండా అతి త్వరలోనే ఆగిపోయిన పరీక్షలను జరిపించి…అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తాము. ఈ విధంగా హరీష్ రావు ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.. కాగా అభ్యర్థులకు కూడా భరోసా ఇచ్చే మాటలు చెప్పారు.. మీరు కూడా ప్రతిపక్షాల వలలో పడి నిరసనలు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దు.. అంటూ వారికి ఓదార్పు మాటలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news