ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మన కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అందులో ఎవరికి అనుమానం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఎవర్నీ అడిగినా, ఏ సర్వే చూసినా గులాబీ జెండా, కేసీఆర్ గెలుస్తరని అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. కోస్గిలో 50 పడకల ఆస్పత్రిని మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని హరీశ్ రావు అన్నారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. అలాంటి కాంగ్రెస్ తెలంగాణలో ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాట పాడుకునే వారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిచేది లేదు, కాంగ్రెస్ నిలిచేది లేదన్నారు. మాటల సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా? తేల్చుకోవాలన్నారు. మూడు గంటల విద్యుత్ చాలు అన్న రేవంత్ కావాలా? 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా? చెప్పాలన్నారు.