వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు

-

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు, ఈ రోజు మరియు రేపు అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.నిన్న దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు ఒడిస్సా తీరము లోని వాయువ్య బంగాళాఖతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.

harishrao
harishrao

దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుండి ప్రజలను కాపాడేందుకు వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధతతో ఉండాలని సూచించారు. ఆయా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఎలాంటి కేసులు వచ్చినా అడ్మిట్ చేసుకుని వెంటనే వైద్యం అందించాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి.

మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా తదితర రోగాల పట్ల అవగాహన పెంచాలని, రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి చికిత్స అందించాలన్నారు. 108 వాహనాలు వెళ్లలేని ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news