ఒమిక్రాన్ కేసులపై మంత్రి హ‌రీష్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న‌

-

ఒమిక్రాన్ కేసుల న‌మోదుపై మంత్రి హ‌రీష్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఒమిక్రాన్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రాలేదని… ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ప్రతి నిత్యం 30 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామ‌ని… సీఎం కేసీఆర్ ఆదేశాలతో క‌రోనా పరీక్షల సంఖ్య లక్షకు పెంచామ‌ని వెల్ల‌డించారు. ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారని… ప్రభుత్వపరంగా కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.

వ్యాక్సిన్ పై రాజకీయ ప్రముఖులు, సినీ స్టార్స్, స్పోర్ట్స్ స్టార్ట్స్ అందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు హ‌రీష్ రావు. 12 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులను నిమ్స్ లో అందుబాటులోకి తెచ్చామ‌ని.. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామ‌న్నారు. నిమ్స్ లో 155 ICU బెడ్స్ అందుబాటులో ఉన్నాయి… మరో 200 ICU బెడ్స్ వచ్చే నెల రోజుల్లో అందుబాటులోకి తేవాలని అదేశించామ‌ని వెల్ల‌డించారు మంత్రి హ‌రీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news