రాజకీయాలకు సోము వీర్రాజు గుడ్ బై ?

-

బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014లో బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టి రాజమండ్రి టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. మంత్రి పదవి ఇస్తానన్నా నేను వద్దనన్నానని తెలిపారు. 2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండనని..సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌చేశారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అవినీతిపరుడని.. బీజేపీలో చేరుతున్నారని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

ఈ రోజే రఘు రామకృష్ణం రాజు అవినీతి వైసీపీ నేతలకు గుర్తుకు వచ్చిందా..? సోము వీర్రాజుకు డిపాజిట్లు కూడా రావడం లేదని ఎద్దేవా చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేను ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదని.. 50 గ్రాములు కొడిగుడ్లు పిల్లలకిస్తే పాదాభివందనం చేస్తాన‌న్నారు. నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టే బదులు కొడిగుడ్లు ఇవ్వొచ్చుగా..? మధ్యాహ్నా భోజనం పథకం.. సరిగా అమలు చేయడం లేదని వెల్ల‌డించారు. మధ్యాహ్నా భోజనం పథకం అమలు చేసే ఐసీడీఎస్ సిబ్బందికి సంబంధించిన యూనియన్లు కమ్యూనిస్టులవేగా.. వాళ్లెందుకు మాట్లాడ్డం లేదన్నారు. కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు..?
కమ్యూనిస్టు నేతలు నోట్లో మట్టి పెట్టుకున్నారా..? అని మండిప‌డ్డారు. ఈ నెల 10న తేదీన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news