సూర్యాపేట పట్టణాభివృద్ధికి గాను 30 కోట్ల రూపాయాలు మంజూరైన నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టేందుకు ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే నని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సృష్టించ బోతున్నారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటరు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని డిసైడ్ అయ్యారని ఆయన తేల్చిచెప్పారు. అభివృద్ధిపై సర్వత్రా హర్షం వ్యక్తం అలవుతున్నదని, ఆ దిశగా ఫలితాలు రాబోతున్నాయని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాలనీల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 1390 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. దానికి తోడు తాజాగా రూ.30 కోట్లు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ఆ నిధులతో రహదారుల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.