ఎన్డీఏ మునిగిపోయే నావ.. మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

-

ప్రధాని మోదీ నేడు నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్ని ప్రసంగించిన ప్రధాని మోదీ.. బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అయితే.. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఒక ఫైటర్ అని..చీటర్స్తో ఆయన కలవరని అన్నారు. ఎన్డీఏ మునిగిపోయే నావ అని….అందులో ఎవరూ చేరరని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఎన్డీఏలో చేరేందుకు తమకు ఏమైనా పిచ్చికుక్క కరిచిందా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం చేయడానికి మోదీ పర్మిషన్ అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. తమ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజల అనుమతి చాలు అని చెప్పారు. మోదీవి పచ్చి అబద్దాలు, పిచ్చి ప్రేలాపనలు అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

Telangana: KTR urges party leaders to not make statements on 'MLAs  poaching' case

అంతేకాకుండా ఈసారి బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదన్నారు.ముప్తీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజులు, యువరాణులు గుర్తురారని మంత్రి కేటీఆర్ మోదీని ప్రశ్నించారు. దేవెగౌడ కొడుకు కుమారస్వామి ఎన్డీఏలో చేరినప్పుడు రాచరికం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అకాళీదళ్, పీడీపీ, టీడీపీ, శివసేన, జేడీఎస్ ల విషయంలో రాచరికం గుర్తు రాలేదా అని అడిగారు. హిమంతు బిశ్వశర్మ, జోతిరాధిత్యపై ఉన్న కేసులు..వాళ్లు బీజేపీలో చేరిన తర్వాత ఏమయ్యాయని అని ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు జైషా ఎవరు..ఆయనకు బీసీసీఐ జనరల్ సెక్రటరీ పదవి ఎందుకు ఇచ్చారని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news