కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కేటీఆర్‌

-

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మాటల పదును చూపెట్టారు. తన మార్కు పంచ్ డైలాగ్‌ తో ప్రతిపక్షాలను హెచ్చరించారు. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news