రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పోడు భూముల పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని.. జిల్లాలో 4 లక్ష72 వేల 329 ఎకరాలు భూమి ఉందని పేర్కొన్నారు. ఫారెస్ట్ 96.394 ఎకరాల అటవీ ప్రాంతం ఉందని.. 2005-06 కేంద్రం ఆర్ ఓ.ఎఫ్ ఆర్ చట్టాన్ని తీసుకు వచ్చిందని వెల్లడించారు. 8 వేల ఎకరాల్లో ఫారెస్ట్ ఏరియా ను అక్రమించుకున్నారని.. 67 గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి సమస్య పరిష్కరించాలని చూస్తున్నామనీ చెప్పారు.
నవంబర్ 8 నుంచి గ్రామాల వారిగా సదస్సులు నిర్వహిస్తామని.. దరఖాస్తు పెట్టుకున్న పోడు రైతుల అర్జీలని పరిశీలిస్తామనీ ప్రకటించారు. భవిష్యత్ సమస్య రాకుండా… దరఖాస్తు తీసుకొని సమస్య పరిష్కరించడం జరుగుతుందని.. భవిష్యత్ లో అటవీ భూములను ఆక్రమించుకుండా చర్యలు తీసుకుంటామనీ స్పష్టం చేశారు. భూములు కేటాయించిన వారితో ప్రతిజ్ఞ తీసుకుంటామనీ.. భవిష్యత్ లో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామనీ వెల్లడించారు.
జిల్లా స్థాయి లో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని.. అడవులు అక్రమించకుండా చర్యలు తీసుకునమన్నారు. అటవి భూమిని సంరక్షణ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామనీ చెప్పారు. ప్రభుత్వానికి రెండో ఎజెండా ఏమీ లేదన్నారు. ఆటవి భూమి ఆక్రమణలపై నేరుగా ఫిర్యాదు చేయలేనివారు, ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాయాలని పేర్కొన్నారు. అటవీ భూముల వ్యవహారంలో అధికారులు ఎవరికి తలొగ్గ వద్దు. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.