ఈ నెల 19వ తేదీన అమెరికాకు మంత్రి కేటీఆర్‌ పయనం

-

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్… అగ్రరాజ్యమైన అమెరికా కి వెళ్లనున్నారు. ఈనెల 19వ తేదీన అమెరికా కు మంత్రి కేటీఆర్ వెళ్లనున్నట్లు… ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ ఉండునట్లు సమాచారం అందుతోంది.

ఇందులో భాగంగానే… 19 వ తేదీ నుంచి ఈనెల 26 వ తేదీ వరకు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పారిశ్రామిక వేత్తలు మరియు ఎన్నారైలతో… ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. అనంతరం.. మార్చి 26 వ తేదీన సాయంత్రం కేటీఆర్‌.. హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు. మంత్రి కేటీఆర్‌ తో పాటు మరో ఇద్దరు తెలంగాణ మంత్రులు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనేది వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇవాళ మంత్రి కేటీఆర్‌.. కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news