రాష్ట్రంలోని రోడ్లన్నీ అద్దంలా తయారు చేస్తున్నా : మంత్రి మల్లారెడ్డి

-

కీసర మండలం చీర్యాల్‌ గ్రామంలోని చీర్యాల్‌ చౌరస్తా నుంచి గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాల వరకు రోడ్డు వెడల్పు పనుల కోసం
సోమవారం కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని రోడ్లన్నీ అద్దంలా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రోడ్ల విస్తర్ణణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని మల్లారెడ్డి తెలిపారు.

I-T searches at residences, offices of Telangana Minister Malla Reddy |  udayavani

రోడ్డ విస్తర్ణణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు మల్లారెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో మరెక్కడ జరుగడం లేదన్నారు మల్లారెడ్డి. రోడ్లతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌ స్థానంలో నిలబడుతుందని, తెలంగాణతో పోటీ పడే రాష్ట్రం దేశంలోనే లేదన్నారు మల్లారెడ్డి. తెలంగాణలో మన సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల బాగు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు మల్లారెడ్డి.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లను కైవాసం చేసుకొని హ్యాట్రిక్‌ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ప్రభుత్వ హయంలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుభీమా పథకాలు చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బెస్త వెంకటేశ్‌, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర, వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, చీర్యాల్‌ సర్పంచ్‌ తుంగ ధర్మేందర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్‌, పి. శ్రీనివాస్‌, కురం రాము, కోల విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news