తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 70 వేల ఉద్యోగాలు..!

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి నిరంజన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 60 వేల 70 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పాత పద్ధతిలో నోటిఫికేషన్ వస్తే 20 వేల ఉద్యోగాలు ఆంధ్ర వారికి వెళ్లిపోతాయని అందుకే ఆ చాన్స్ దక్కకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో 60 వేల నుండి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ఏడేళ్లలో లక్షా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని విమర్శించారు. ఇదిలా ఉంటే కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఇలాంటి మాటలు చెబుతోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ త్వరలో ఉద్యోగాలు అంటూ ఇలాంటి ప్రకటనలు చేసి నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.