శ్రీశైలంలో మంత్రి రోజా పూజలు.. బెజవాడ దుర్గమ్మ దేవాలయంలో భక్తుల రద్దీ..

-

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఏపీ టూరిజంశాఖ మంత్రి రోజా (Roja) దర్శించుకున్నారు. ఈ సందర్శంగా స్వామిఅమ్మవార్లకు రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం సున్నిపెంటలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొననున్నారు. కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్‌లో భక్తులు కిక్కిరిశారు.

AP News: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న మంత్రి రోజా | Minister Roja  visited Srisailam Mallanna kurool andhrapradesh suchi

ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్న శివాలయాలు… పంచారామ క్షేత్రాలు, శైవ క్షేత్రాలలో భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి 365 వత్తులు వెలిగించుకుంటున్నారు. ఉదయం నుంచి కృష్ణా నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలను భక్తులు నదిలో వదులుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం నిర్వహించారు. అమ్మవారి భక్తుల కోసం భవానీల కోసం ఈ రోజు నుంచి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news