నారాయణఖేడ్ ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్

-

సంగారెడ్డి లోని నారాయణఖేడ్ కస్తూర్భా గాంధీ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. అల్పాహారం వికటించి 35 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అయితే వాళ్ళు ఏం తిన్నారు, వాళ్లు తిన్న ఫుడ్ పాయిజన్ అయిందా? లేక వాటర్ పొల్యూట్ అయిందా అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్యాశాఖ సంచాలకులను ఆదేశించారు.

 

ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు చికిత్స పొందుతున్న నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి కి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. విద్యార్థులందరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంతవరకు ఏరియా ఆసుపత్రిలోనే ఉండి పర్యవేక్షించాలని జిల్లా వైద్యశాఖ అధికారిని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news