జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజి వీరుడు….బుద్దిలేని సన్యాసి అని నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ సన్యాసి… రాజకీయ పార్టీ ఎవరైన స్థాపిస్తే ఆయన అధికారంలోకి రావాలనుకుంటాడని మండిపడ్డారు మంత్రి శంకర్ నారాయణ.
ఒకసారి టీడీపీ, మరోసారి బీజెపి, కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటాడని ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్థాననే పవన కళ్యాణ్ 2014 నుంచి 2019 వరకు ఎందుకు ప్రశ్నించలేదని నిప్పులు చెరిగారు మంత్రి శంకర్ నారాయణ.
2014 నుంచి 2019 వరకు ఎక్కడ నిద్రపోయాడో చెప్పాలని ప్రశ్నించారు మంత్రి శంకర్ నారాయణ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు టీడీపీ, జన సేన పార్టీల వైపు చూడటం లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషం గా ఉంటే జనసేన పార్టి కి నిద్ర రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటివారిపై బరద చల్లటం పవన్ కు వెన్నతొ పెట్టిన విద్య అని.. ఆయన మాట్లాడే తీరు చాలా దారుణమని మండిపడ్డారు మంత్రి శంకర్ నారాయణ.