జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఇటీవల రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. దీంతో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా అదే రీతిలో వైసీపీ మంత్రులు మరియు నాయకులు ఫైర్ అయ్యారు. దీంతో మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు… ఒక్కసారిగా వేడెక్కాయి. పరస్పర వ్యాఖ్యలతో… జనసేన పార్టీ మరియు వైసీపీ పార్టీ ల మధ్య వివాదం తారస్థాయికి చేరింది.
వరుసగా ప్రెస్ మీట్ లు పెడుతూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు నాయకులు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని కి జనసేన పార్టీ నాయకులు నిరసన సెగ తగిలింది. మంత్రి పేర్ని నాని కాన్వాయ్ ని అడ్డుకున్న ఎందుకు ప్రయత్నించారు జనసేన పార్టీ నాయకులు.
పశ్చిమగోదావరి జిల్లాలోని… తణుకు ప్రాంతంలో మంత్రి పేర్ని నాని కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు జనసేన పార్టీ నాయకులు. దీంతో తణుకు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని వెనక్కి తీసుకోవాలని అలాగే క్షమాపణలు కూడా చెప్పాలని నిరసనకు దిగారు జనసేన కార్యకర్తలు. ఇక ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి… మంత్రి కాన్వాయ్ కి దారిని సుగమం చేశారు పోలీసులు. దీంతో అక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.