ఏకాకిగా మారిన జనసేన ఎమ్మెల్యే…!

-

తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు హాట్‌హాట్‌ చర్చ జరుగుతోంది. అనధికారికంగా వైసీపీకి అనుబంధ సభ్యుడిగా ఉన్న ఆయనకు కొంతకాలంగా నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట.ఈ పరిణామాలతో లాభం లేదని భావించిన ఎమ్మెల్యే రాపాక.. ఆ మధ్య తాను వైసీపీ వాడినే అని ప్రకటించి.. ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా రాజోలు వైసీపీలో వర్గాలు రెండు నుంచి మూడయ్యాయి.

మొన్నటి వరకు రాజోలులో వైసీపీ రెండు వర్గాలుగా ఉండేది. ఒక గ్రూపు ఎమ్మెల్యే రాపాకకు మద్దతుగా నిలిచేది. వరసగా రెండు ఎన్నికల్లో ఓడిన బొంతు రాజేశ్వరరావు ఓ వర్గమైతే.. రాజోలు ఇంఛార్జ్‌గా ఉన్న పెదపాటి అమ్మాజీది మరో గ్రూపు. సీఎం జగన్‌కు జైకొట్టిన నాటి నుంచి పెదపాటి వర్గంలో కలిసి ప్రయాణిస్తున్నారు ఎమ్మెల్యే. ఏమైందో ఏమో కానీ.. ఇటీవల కాలంలో పెదపాటి అమ్మాజీ వర్గం సైతం ఎమ్మెల్యేతో టచ్‌మీ నాట్‌ అన్నట్టు ఉంటోందట. దీంతో ఇటు జనసేన.. అటు వైసీపీ కేడర్‌ రెండూ వెంట లేక.. రాజోలులో రాపాక ఏకాకిగా మారి ఉనికి కోల్పోతున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.అలాగే బొంతుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ ఇవ్వకపోతే జనసేన నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news