స్ట్రాటెజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్లాన్ (SNDP) కింద రూ.10 కోట్ల వ్యయంతో పికెట్ నాలాపై నిర్మించిన వంతెనను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నగరంలో వరద ముంపు సమస్యకు ఎస్‌ఎన్‌డీపీతో శాశ్వత పరిష్కారం లభిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని నాలాలతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని చెప్పారు మంత్రి తలసాని. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో SNDP కింద నాలాల సమగ్ర అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి తలసాని తెలిపారు.
పికెట్ నాలాపై బ్రిడ్జి నిర్మాణంతో 40 కాలనీల ప్రజలకు వరద ముంపు సమస్య నుంచి శాశ్వత విముక్తి లభించిందన్నారు మంత్రి తలసాని. బేగంపేట నాలా అభివృద్ధి పనులు కూడా రూ.46 కోట్ల వ్యయంతో వేగంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని చెప్పారు.