‘మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి’ నుంచి సాంగ్ రిలీజ్‌

-

జాతిరత్నాలు ఫేం న‌వీన్ పొలిశెట్టి , అనుష్కా శెట్టి   టైటిల్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన టీజర్‌, పోస్టర్లతోపాటు నో నో నో, హతవిధి సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే మేకర్స్ లేడీ లక్‌ ప్రోమోను లాంఛ్ చేయగా.. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ను విడుదల చేశారు. నవీన్ పొలిశెట్టి, అనుష్కను ఫాలో అవుతూ పాడుకుంటున్న ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

Miss. Shetty Mr.Polishetty | Telugu Song Promo - Lady Luck | Telugu Video  Songs - Times of India

‘ఎందుకంత ఇష్టం నేనంటే .. ఇందులోని గొప్ప నేను నీకంటే .. ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే’ అంటూ ఈ పాట సాగుతోంది. రాధన్ స్వరపరిచిన ఈ బాణీకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, కార్తీక్ ఆలపించాడు. హుషారైన బీట్ .. అందుకు తగిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి. అనుష్కను అభిమానిస్తూ .. ఆరాధిస్తూ .. ప్రేమిస్తూ, ఆమె రాకతో తన లైఫ్ మొత్తం మారిపోయిందని హీరో వ్యక్తం చేసే తన మనసులోని మాటనే ఈ పాట. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా ప్రమోషన్స్ పుంజుకుంటాయనే చెప్పాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news