రజనీకాంత్ తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమావేశం

-

సూపర్ స్టార్ రజనీకాంత్ తో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన గృహప్రవేశానికి సూపర్ స్టార్ రజినీ కాంత్‌ ను ఆహ్వానించారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

చెన్నైలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు వెళ్లారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. జూన్ 7వ తేదిన తాండూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటి గృహ ప్రవేశానికి రావాలని.. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆహ్వానించారు. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒప్పుకున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news